Friday, November 22, 2024

ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జ్యుడీషియల్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ సదస్సుకు హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం (ఏప్రిల్‌ 29న) ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వేళ్లారు జగన్.​ హస్తిన పర్యటనలో రేపు (30వ తేదీ) జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.

కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు వారాల క్రితం కూడా జగన్ హస్తినకు వెళ్లారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటూ పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో చర్చించారు ఏపీ సీఎం జగన్​. పోలవరం, విభజన సమస్యలతో పాటూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా ప్రస్తావించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వచ్చారు.

ఈ రోజు సాయంత్రం న్యూ ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లో సివిల్ సర్వీస్ చదువు తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మర్యాద పూర్వకముగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పుష్ప గుచ్చాము ఇచ్చి, జ్ఞాపికను బహుకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement