రాజ్యాంగ దుర్వినియోగం తగదు
ఓటుతో జనమే బుద్ది చెబుతారు
రాజ్యాంగం మంచిదే…
అమలు చేసేటోళ్లే చెడ్డోళ్లు కావొద్దు
ఇక విద్యార్థులకు రాజ్యాంగప్రతితో అవగాహన
ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి
సచివాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
భారత రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని సీఎం చంద్రబాబు అన్నారు. 299 మంది విశిష్ఠ వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు.. పదకొండు మంది ఏపీ నుంచీ రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషం అన్నారు. రాజ్యాంగ రచనలో పాల్గొన్న ఏపీ మేధావులకు నివాళులర్పించాలని కోరారు. వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్ లో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల చీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును మనం వేడుకగా జరుపుతున్నామని చెప్పారు.. కాగా, ఓటుతో రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు.
సమానత్వం రాజ్యాంగం అభిమతం
మనం వినూత్న భావనతో ఆలోచించడం మానేశామని అన్నారు.. చాలా దశాబ్దాలుగా మనం ఆధారపడే వారుగానే ఆలోచించామన్నారు… రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు నుంచీ పట్టుదలతో రాజ్యాంగం రచించుకున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు . మన రాజ్యంగాన్ని చదివి భవిష్యత్తులో సవాళ్లను కూడా ఊహించి ప్రపంచ దేశాలు తమ రాజ్యాంగాన్ని రచించాయని ఆయన వెల్లడించారు. రాజ్యాంగ స్ఫూర్తితో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని మనం నేర్చుకోవాలని ఏపీ సీఎం సూచించారు. అవకాశాల్లో సమానత్వాన్ని మనం కచ్చితంగా అనుసరించాలని కోరారు. .. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని. పేర్కొన్నారు.
ఇక విద్యార్ధులకు రాజ్యాంగంపై అవగాహన
విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, . పిల్లలకు అర్థమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు… ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం 26 నవంబర్ 1949న వచ్చిందన్నారు.. రాజ్యాంగ రూపకర్తలను మనం స్కరించుకోవాలన్నారు.. ఈ సమావేశంలో హోం సెక్రెటరీ తప్ప మిగతా ఐపీఎస్ లు ఎవరూ లేరని, రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్థమయ్యేలా అందుబాటులోకి తేవాలని కోరారు… పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా రాజ్యాంగ ప్రతిని అర్థమయ్యేలా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయ పడ్డారు.
పిల్లలే భవిష్యత్ వారదులు..
పిల్లలే భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమేనని అన్నారు.. సమాన పనికి సమాన వేతనం, మహిళల పట్ల ప్రత్యేకత చూస్తే తెలుస్తుందన్నారు. రాసే వారు ఎలా రాసినా… అమలు చేసే వారు సరిగా ఉండాలన్నారు.. సీఎస్ వీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. మనది అతిపెద్ద రచనా రాజ్యాంగం అని గుర్తుచేశారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. 75వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, సమగ్ర పరిష్కారంగా పనిచేసేలా రాజ్యాంగ రచన జరగడం విశేషమని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడిపే విధానాలు ఇందులో ఉన్నాయన్నారు.. సున్నితమైన సునిశిత అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి అని వెల్లడించారు ..