ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 11వ తేదీ చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. 11వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement