రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటించనుంది. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొననుంది.
భాగంగా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, సులువుగా అనుమతులు ఇవ్వడం, మానవ వనరుల లభ్యత వంటి వాటిని వివరించి, పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 8 మంది బృందంలో మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీనాథ్ బండారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఐ అండ్ సీ శాఖ కార్యదర్శి డా. యువరాజ్, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈవో సీఎం సాయికాంత్ వర్మ, కాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ దావోస్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.