Wednesday, November 6, 2024

AP – నేడు చంద్రబాబు కీలక శాఖలపై సమీక్ష .. హాజరుకానున్న పవన్ కల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు..

ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు.. గత ప్రభుత్వ హయాంలో నరేగా పనుల్లో అవినీతి ఏమైనా జరిగిందా అనే అంశం పైనా సమీక్షించే అవకాశం ఉంది.. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం, రిపేర్లపై సమీక్షలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. అటవీ, పర్యావరణం సమీక్షలో ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి, మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్రీ వంటి అంశాలపై కీలక చర్చ సాగనుంది.. కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కి రప్పించడం, ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి వంటి అంశాలపై కర్ణాటక ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల వివరాలను ఈ సందర్భంగా పవన్ వెల్లడించనున్నారు.

- Advertisement -

కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తనకు కేటాయించిన కీలక శాఖలపై వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆయా శాఖల్లో జరుగుతోన్న పనులు, ఉన్న నిధులు.. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. ఇలా అనేక అంశాలపై ఆరా తీశారు.. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సమీక్షంచబోతోన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement