Tuesday, September 17, 2024

AP – ఆ ఎమ్మెల్యేలతో త‌ల‌పోట్లు .. కంట్రోల్ చేయండి….

అమ‌రావ‌తి – కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement