Sunday, November 24, 2024

AP – భవిష్యత్ అంతా టూరిజందే …. సీప్లేన్ సర్వీసులతో మరింత అభివృద్ది: చంద్రబాబు

రానున్న రోజుల‌లో సీ ప్లేన్ స‌ర్వీస్ ల‌కు ప్రాధాన్యం
గ‌త ప్ర‌భుత్వ విధానాల‌తో ఎపి అధోగ‌తి పాలు
వాటిని ఇప్పుడు స‌రిచేసే ప‌నిలో ప‌డ్డాం
ఎపిని నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
సీప్లేన్ స‌ర్వీస్ ప్రారంభ‌స‌భ‌లో చంద్ర‌బాబు

విజయవాడ: భవిష్యత్‌ అంతా పర్యాటకానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో ఏ యిజం ఉండద‌ని, టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ‘సీ ప్లేన్ స‌ర్వీస్ ల‌ను నేడు విజ‌య‌వాడ పున్న‌మిఘాట్ లో లాంచ‌నంగా ప్రారంభించారు.. అనంతరం విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఈ సీ ప్లేన్ ఇందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడు అని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడాయన అని కొనియాడారు. సివిల్ ఏవియేష‌న్ ను అద్భుతంగా నడిపిస్తున్నార‌ని ప్రశంసించారు.

వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ప్ర‌జ‌లు ఆక్సీజ‌న్ ఇచ్చార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. విధ్వంసమైన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌కాలం ఏపీని చూసి అవ‌హేళ‌న చేశారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏపీకి మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. ఏపీలో ప్ర‌జ‌లు గెలిచార‌ని, రాష్ట్రాన్ని నిలబెట్టార‌ని అన్నారు. ప్ర‌భుత్వ విధానాలు చాలా ముఖ్య‌మ‌ని, ప్ర‌భుత్వం నిర్ణ‌యాల వ‌ల్ల భావి త‌రాలకు భవిష్య‌త్ ఉంటుంద‌న్నారు.

- Advertisement -

తాను 20 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ప్ర‌స్తావిస్తే ఐటీ తిండి పెడుతుందా అని ఎద్దేవా చేశార‌ని అన్నారు. కానీ ఆ రోజు వేసిన ఫౌండేష‌న్ వ‌ల్ల‌నే తెలుగు వాళ్లు అమెరికాలో ఐటీలో ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు. అమెరికాలో ప‌ర్ కాపిటాలో కూడా భార‌తీయులే ముందున్నార‌ని అన్నారు. ఏపీ నుండి వెళ్లిన‌వాళ్లు ల‌క్షా ఇర‌వై వేలు సంపాదిస్తున్నార‌ని అన్నారు. అమెరికాలో ఉన్నా విజ‌య‌వాడ‌లో ఉన్నా ఆదాయం పెంచేందుకు ప్ర‌య‌త్నించాన్నారు. ఏపీలో పుట్టిన వాళ్లు ఇక్క‌డ రాణించ‌రు కానీ ప‌క్క రాష్ట్రాల్లో, ఇత‌ర ప్రాంతాల్లో రాణిస్తార‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోనే వ‌న‌రులు ఉన్నాయ‌ని, సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

విజ‌య‌వాడ‌ను హైద‌రాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. మోడీ కూడా సీప్లేన్ లు ప్ర‌మోట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చార‌న్నారు. సీప్లేన్ ల‌కు ఎయిర్ పోర్టు కూడా అవ‌స‌రం లేద‌ని అన్నారు. రాబోయే రోజుల్లో సీప్లేన్ తో ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేసే అవ‌కాశం వ‌స్తుంద‌న్నారు. సీప్లేన్ ద్వారా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్నారు. ఏమైనా స‌మ‌స్య వ‌స్తే యువ‌త భ‌య‌ప‌డిపోవ‌ద్దని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నామ‌న్నారు. యువత హార్డ్ వ‌ర్క్ కాకుండా స్మార్ట్ వ‌ర్క్ చేయాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement