Saturday, September 21, 2024

AP – శ్రీశైలంలో చంద్ర‌బాబు … మ‌రికొద్దిసేప‌టిలో కృష్ణ‌మ్మ‌కు జ‌ల‌హార‌తి…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేటి ఉద‌యం అమరావ‌తి నుంచి హెలికాప్ట‌ర్ లో సున్నిపెంట‌కు చేరుకున్నారు.. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం కు బ‌య‌లు దేరారు.. ముందుగా ఆయ‌న శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.. ముఖ్యమంత్రి. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి 12:30కి హెలికాప్టర్‌లో అనంతపురం వెళ్తారు సీఎం చంద్రబాబు.

కాగా, హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు స్వాగతం పలికారు.

మ‌డ‌క‌శిర‌లో పించ‌న్లు పంపిణీ..

- Advertisement -

ఇక, శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్‌ అందిస్తారు.. సీఎం. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

సీఎం షెడ్యూల్..

  • 11:25 కి శ్రీశైలం జలాశయం సందర్శన, కృష్ణానదికి జలహారతి, నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ
  • 11:40కి శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సందర్శన
  • మధ్యాహ్నం 12:05కి నీటి వినియోగదారుల అసోసియేషన్ తో చంద్రబాబు భేటీ
  • 12:30కి హెలికాప్టర్ లో అనంతపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
  • మధ్యాహ్నం 1:45కి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకొనున్న సీఎం.
  • 2:20 గంటలకు గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ
  • 3:20 కి గుండుమలలో కరియమ్మ దేవి దేవాలయన్ని సందర్శన.
  • 3:25 నుంచి 4:25 దాక గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖాముఖి.
Advertisement

తాజా వార్తలు

Advertisement