Wednesday, September 18, 2024

AP – నెర‌వేరిన శ‌ప‌థం… ముఖ్య‌మంత్రిగా స‌భ‌లో అడుగుపెట్టిన చంద్ర‌బాబు

రాజకీయ నేతలు శపథాలు చేయడం, సవాళ్లు విసరడం సాధారణం. దాన్ని నేరవేర్చకోకుంటే నవ్వుల పాలవుతారు. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శపథం నెరవేరింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత శుక్రవారం ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీ ప్రధాన ద్వారానికి నమస్కరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లోపలికి వెళ్లారు.


రెండున్నరేళ్ల కిందటి ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తే సరిగ్గా 2021 ఏడాది నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, సభలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఓ శపథం చేశారు. కౌరవసభను గౌరవ సభగా మార్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. అక్షరాలా దాన్ని ఆయన నిజం చేస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాల రావడంతో అసెంబ్లీ అంతా పసుపుమయంగా మారింది. ఆ త‌ర్వాత ముందుగా చంద్ర‌బాబుతో ఎమ్మెల్యేగా ప్ర‌మాణం స్వీకారం చేయించారు ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement