Sunday, September 15, 2024

AP – గురు పౌర్ణిమ మ‌హోత్స‌వంలో చంద్ర‌బాబు ..

ఆంధ్ర‌ప్ర‌భ స్టార్ట్ – అమ‌రావ‌తి – మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌ సెంటర్‌లో నేడు నిర్వ‌హించిన గురుపౌర్ణమి మహోత్సవంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

అలాగే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు తెలిపారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement