అమరావతి – దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు చంద్ర బాబు. . ఈ క్రమంలో నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు
ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4.95 లక్షల మంది మహిళలు దీపం పథకంకు అర్హులుగా ఉన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2:15 వరకు గ్రామస్తులతో ముఖాముఖి, సభలో ప్రసంగం చేయనున్నారు.
మధ్యాహ్నం 3:15 గంటలకు సీఎం శ్రీకాకుళం చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 6:30 వరకు జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.
రాత్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. రాష్ట్రంలో దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.