Thursday, December 26, 2024

AP – నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్న చంద్ర‌బాబు ..

వెల‌గ‌పూడి – ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీలోకి వెళ్ల‌నున్నారు.. రేపు ఢిల్లీలో జరిగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకల్లో ఆయ‌న పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో నిర్వహించ‌నున్నారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్ర‌మంలో పాల్గొన‌నున్నారు..

మాజీ ప్ర‌ధాని. వాజ్‌పేయ్ రాజకీయ మార్గదర్శకత్వం, దేశభక్తి, వంటి అనేక సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఈ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు హాజ‌రుకానున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement