అమరావతి : రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక విజన్‌ను తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీ4 విధానం గేమ్ ఛేంజర్ కానున్నదని పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ లక్ష్యమని అన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ (పీ3) విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పదేపదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయం పెరిగితే పేదవారిని పైకి తీసుకురావచ్చని వివరించారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చని ఆయన అన్నారు.
ఎపికి పోలవరం జీవనాడి ……………….
ఎపీకి పోలవరం జీవనాడి అని.. కానీ వైసీపీ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు చంద్రబాబు. గత పాలకులు రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారన్నారు. పారిశ్రామిక వేత్తలను కూడా భయపెట్టారని తెలిపారు. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచుతామని.. ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలను అమలు చేసి పెద్దవాళ్ళను పైకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆర్థిక సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయన్నారు. తాను వాటిని మనసా వాచా నమ్మానన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి వెలుగులు పెంచానని.. కానీ తాను అధికారాన్ని కోల్పోయానని తెలిపారు. ఐటీని తీసుకువచ్చానని, ఈరోజు ఐటీ అనేక కుటుంబాల్లో జీవనోపాధి కలిపించిందన్నారు.
అనాడు వద్దన్నారు..
హైదరాబాద్.. ఇండియాలో నెంబర్ 1 అయ్యి తెలంగాణకు బ్యాక్ బోన్‌గా మారిందని.. తెలంగాణకు హైదరాబాద్ ద్వారా అత్యధిక తలసరి ఆదాయం వస్తుందన్నారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేశారని.. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తోందన్నారు. సంపద పెంచితే ఆదాయం పెరిగి సంక్షేమ పధకాల అమలుకు అవాకాశం ఉంటుందని.. ఇదే తాను నమ్మిన సిద్ధాంతమన్నారు. ఆర్ధిక సంస్కరణలు అప్పట్లో వేరే మార్గం లేకుండా చేశారని.. అయితే రెండో తరం సంస్కరణలను తాను మొదలుపెట్టినట్లు తెలిపారు. పవర్ సెక్టార్ రిఫార్మ్స్, విమానాశ్రయాలకు ఓపెన్ ఫ్లై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, రోడ్లకు శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరు నుంచి చెన్నైకి తరువాత గోల్డెన్ క్వార్డలైటర్‌లు వచ్చాయని… సంపద వచ్చింది ఆదాయం పెరిగిందని తెలిపారు.
జీఎస్‌డీపీ ముఖ్యం..
‘‘నేను పెన్షన్ పెంచాను.. దీని వలన వారిని చూసేందుకు పిల్లలు ముందుకు వస్తున్నారు. మనుషులను మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను అందరినీ కనెక్ట్ చేస్తున్నాను. ఇల్లు అన్నింటికీ జియో ట్యాగింగ్ చేయిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసమే. పీ – 4 అనేది ఒక గేమ్ చేంజర్‌గా మారుతుంది. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారు అట్టడుగు స్థాయి ఉన్నవారిని పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం జీఎస్‌డీపీ ముఖ్యం. నేను అనుకున్న లక్ష్యానికి భవిష్యత్తులో రీచ్ అవుతాము. మేము తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌పై 16 లక్షల మంది తమ అభిప్రాయాలను ఇచ్చారు. చివరకు కేంద్రం వికసిత భారత్‌కు కూడా అన్ని అభిప్రాయాలు రాలేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
మా లక్ష్యమదే…
ప్యామిలీ మెంబర్స్ అందరికి కనెక్ట్ చేసి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు. విపత్తు వస్తే ప్రతి ఇంటికి సాయం అందించగలుగుతామన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ప్యామిలీ సాధనే లక్ష్యమన్నారు. పీ4 భవిష్యత్తులో ఒక గేమ్ చేంజర్ అవుతుందని.. గతంలో పీ 3 సంపద సృష్టించిందన్నారు. ఇండియా 1 నుంచి 2 శాతం గ్రోత్ చేయడం వల్ల దాన్ని హిందూ గ్రోత్ రేట్ అని ఎగతాళి చేశారన్నారు. ప్రజల్ని భాగస్వాములను చేయాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడు నెలలు ఏం చేశామో దక్షిణాది రాష్ట్రాలతో కంపేర్ చేసి చెపుతామన్నారు.
గతేడాది కంటే…
‘‘టీడీపీ పాలనలో 13.5 శాతం గ్రోత్ ఉంది.. ఇకపై ఈ గ్రోత్ రేట్ 15 శాతం పెంచాలని చూస్తున్నాం. 2047 నాటికి ఈ వృద్ధి సాధిస్తే 58 లక్షల14 వేలు 916 కోట్ల తలసరి ఆధాయం సాధిస్తాం. ఏపీ నుంచి అమెరికా వెళ్లిన వారు అక్కడి వారి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా కల్పిస్తే మన ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. వృద్ధిరేటును డబుల్ చేస్తే నాలుగున్నర రెట్లు ఆదాయం పెరిగిపోతుంది. గత ఏడాది కంటే ఈ ఏడు 4.03 శాతం వృద్ధి రేటు పెరిగింది. 1 శాతం ఆదాయం పెరిగితే ఏటికేడు ఆధాయంలో పెరుగుదల వస్తుంది. ఈ ఏడాది గ్రోత్ రేటు 12. 94శాతం పెరిగింది. రాష్ట్ర సొంత ఆదాయం, అటు ఎఫ్‌ఆర్‌బీఎం కూడా ఇలా వెళితే భారిగా పెరుగుతుంది. ఈ వృద్ధి రేటు సాధించకపోతే అప్పు చేయాలి అప్పడు డెట్ ట్రాప్‌లోకి వెళ్లిపోతాం. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. గత ఏడాది వృద్ధి రేటు 8.20 ఉంటే ఇప్పుడు 12.94 శాతంకు చేరింది. ఆల్ ఇండియా గ్రోత్ కంటే 3.24 శాతం అధనంగా గ్రో అయ్యాయి. 2019-24 కాలంలో పర్ క్యాపిటా ఇన్ కం కూడా పడిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి వ్యవసాయం రైతుకు అండగా ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.