Thursday, December 12, 2024

AP – ఆరు నెలల పాలనపై కలెక్టర్ లతో చంద్రబాబు నేడు సమీక్ష

అమరావతి : కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నేటి నుంచి రెండు రోజుల పాటు సిఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం దిశా నిర్దేశం చేయనున్నారు. రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపైనా ఈ సమీక్షా సమావేశాల్లో చర్చించనున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల హెచ్‌ఒడిల నుంచి శాఖలవారీ అభిప్రాయాలను సిఎం తెలుసుకోనున్నారు.

తొలి రోజు ఆర్‌టిజిఎస్‌, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌, పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టికల్చర్‌, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ, రూరల్‌ వాటర్‌ సప్లై, సెర్ప్‌, పట్టణాభివృద్ధి, సిఆర్‌డిఎ, శాంతి భద్రతలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

రెండో రోజు పరిశ్రమలు, ఐటి, ఇండిస్టీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, విద్యుత్తు, మానవ వనరులు, ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాలు, హౌసింగ్‌, హెల్త్‌, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్‌, మైన్స్‌, డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్స్‌ వంటి వివిధ అంశాలపై అధికారులతో సిఎం చర్చిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, ఐపిఎస్‌ అధికారులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement