Thursday, December 12, 2024

AP – నేడు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై చంద్ర‌బాబు స‌మీక్ష

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు , ఎస్పీ లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అలాగే రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నారు.

26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే సదస్సులో వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement