Saturday, November 30, 2024

AP – ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష…

అమ‌రావ‌తి – బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన ఫెంగల్ తుపాను ఈ సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు
విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో నేడు సమీక్ష నిర్వ‌హంచారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికార‌ల‌ను కోరారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను ఎప్ప‌టిక‌ప్ప‌డు అప్రమత్తం చేయాలని క‌లెక్ట‌ర్ల‌ను కోరారు.

అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు సీఎం. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లను కోరారు సీఎం . తుఫాన్ పై క‌ళ్లాల‌లో ధాన్యం ఆరబోసిన రైతులు తుపాన్ కార‌ణంగా ఆందోళ‌న చేందుతున్నార‌ని అంటూ, వ‌ర్ష‌, వ‌ర‌ద నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలన్న అన్నిజిల్లా కలెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement