Tuesday, September 17, 2024

AP – అనాథ మృత‌దేహాల‌కు ప్ర‌భుత్వం త‌రుపున‌ అంత్య‌క్రియ‌లు….చంద్రబాబు

ఆదేశాలు జారీ చేసిన చంద్ర‌బాబు…
ప్ర‌తి కుటుంబానికి వారానికి స‌రిప‌డా
నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వండి..
న‌ష్ట పరిహారం చెల్లింపులు వేగ‌వంతం చేయండి
ఆహారం, నీరు డోర్ టు డోర్ వెళ్లాల్సిందే
అధిక ధ‌ర‌లకు నిత్యావసరాలు అమ్మితే క‌ఠిన చర్య‌లు
విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ‌, శానిటేషన్ ప‌నులో వేగం పెంచండి
మంత్రులు, జిల్లా కలెక్ట‌ర్ లు, ఉన్న‌తాధికారుల‌కు ఆదేశం

విజ‌య‌వాడ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే వరద బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ, పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించేందుకు పని చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకురావాల‌న్నారు… ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాల‌ని,.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.

- Advertisement -

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాల‌న్నారు.. వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది అని అంటూ అక్క‌డ‌కు నేరుగా వెళ్లి సాయం ఇవ్వాల‌ని కోరారు.. ఇక, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలి అని ఆదేశించారు.. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాల‌న్నారు… అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి అని అధికారుల‌ను ఆదేశించారు. . విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాల‌ని, . శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాల‌న్నారు. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాల‌ని సూచించారు. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంద‌ని, . ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాల‌ని సూచించారు.. ప్ర‌తి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాల‌ని అంటూ.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించడంతో పాటు పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఈరోజు ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని మంత్రులు, అధికారులు తెలిపారు. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే, 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించామ‌ని వివ‌రించారు. మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచామ‌ని చెప్పారు. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించామ‌ని, .. మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండగా.. వాటితో పారిశుధ్యం పనులు మొదలు పెట్టామని తెలిపారు. శానిటేష‌న్ కోసం అయిదు వేల మంది సిబ్బందిని సిద్దం చేశామ‌ని చంద్ర‌బాబుకు అధికారుల వివ‌రించారు..

రేపల్లె పర్యటన రద్దు

వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చేపట్టనున్న ఏరియల్ సర్వే, రేపల్లె పర్యటన రద్దు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement