Monday, September 30, 2024

AP వివిధ కేసుల పురోగ‌తిపై చంద్ర‌బాబు స‌మీక్ష ..

మ‌ద్యం,గ‌నుల స్కామ్ పై అరా
ఫైబ‌ర్ నెట్,భూక‌బ్జాల ద‌ర్యాప్తు వివ‌రాలు సేక‌ర‌ణ‌
కేసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని అదేశం

అమ‌రావ‌తి – మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..

మదనపల్లెలో తగులబడిన ఫైళ్లు ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు.. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. దర్యాప్తు సంస్థల అధినేతలతో సమావేశం నిర్వ‌హించి వివిధ కేసుల ద‌ర్యాప్తు వివ‌రాల‌ను తెలుసుకున్నారు..

ఈ సమావేశానికి డీజీపీ సీఎస్‌ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమీక్షలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్త పాల్గొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement