Tuesday, November 26, 2024

AP – గ‌త ప్ర‌భుత్వంలో భూ దందాలు,స‌హజ వ‌న‌రుల దోపిడీ – చంద్రబాబు

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ఆమ‌రాతి – ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో.. గురించి సీఎం చంద్రబాబునాయుడు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రీసర్వే పేరుతో భూముల హద్దుల్ని మార్చేశారన్నారు. ముఖ్యంగా విశాఖలో మాజీ ఎంపీ హయగ్రీవ భూముల్ని కాజేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై నేడు స‌చివాల‌యంలో ఆయ‌న శ్వేతపత్రం విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వైసీపీ హయాంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దుర్వినియోగం వివ‌రాలను వెల్ల‌డించారు. భూదందాతో పాటు, ఖనిజ సంపదను సైతం దోచేశారని విమర్శించారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన ల్యాండ్ ను జిల్లాస్థాయిలో నివాసస్థలంగా చూపించి బెదిరించారన్నారు.

- Advertisement -

విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో గత ప్రభుత్వ పాలకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో రూ.101 కోట్ల విలువైన భూముల్ని లాక్కున్నారు. తిరుపతిలో రూ.207 కోట్ల విలువైన భూముల్ని, చిత్తూరులో రూ.99 కోట్ల విలువైన భూముల్ని కాజేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో భూముల అక్రమాలకు తెరలేపారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు గత ప్రభుత్వం అసైన్డ్ భూములను అప్పగించిందని తెలిపారు చంద్రబాబు .

గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి స్థలాలను ఆక్రమించుకున్నారని శ్వేతపత్రంలో తెలిపారు. ఖనిజ సంపదను దోచుకుని.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. 22 A ను ఉపయోగించి తిరుపతి భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement