Saturday, October 19, 2024

AP – న‌వ్యాంధ్ర‌కు చంద్రబాబు మరోసారి శ్రీ‌కారం! అమరావతి పనుల్లో ఇక స్పీడ‌ప్‌

మ‌ళ్లీ పట్టాలపైకి సీఆర్డీయే పనులు
ఆఫీసు నిర్మాణానికి అథారిటీ ఆమోదం
స్వయంగా ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఉద్ధండ‌రాయుని పాలెంలో నవ ఉల్లాసం
ఇప్ప‌టికే పూర్తి అయిన‌ జంగిల్ క్లియరెన్స్
రంగంలోకి దిగిన నిర్మాణ సంస్థలు
రాజధాని బాటప‌ట్టిన‌ కూలీ జనం
ఆర్‌5 జోన్ ప‌రిధిపైనా చంద్ర‌బాబు స‌మీక్ష‌
ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, కరకట్టపై ఫోర్‌లైన్స్ ర‌హ‌దారి
ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిన సీఎం

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్​:
ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు సీఎం కొత్త కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఏపీ సీఆర్డీయే ప్రాజెక్టు కార్యాలయం పనులను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు స్వయంగా పనులు ప్రారంభించారు. ఈ నెల 16న జరిగిన సీఆర్డీయే సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పనులు దారినపడ్డాయి. గత బుధవారం సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితి సహా మెుత్తం 12 అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.

సంపద సృష్టికి కేంద్రంగా మారుద్దాం..

గతంలో భూమి పొందిన సంస్థలు, మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎవరికి భూములు కేటాయించాలి, ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలనే అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. రాజధాని అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే సంస్థలకే భూ కేటాయింపులు చేయాలని చంద్రబాబు తెలిపారు. టాప్ 10 కాలేజీలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులు ఏర్పాటు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాజధాని ఏరియాలో ఆర్​5 జోన్​పైనా సమీక్ష..

- Advertisement -

జీవో 207 ప్రకారం 8352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణమే.. దాని పరిధని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తేవాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తెచ్చిన ఆర్ 5 జోన్‌పైనా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరపాలని అధికారులకు సూచించారు. దీనిపై త్వరలో చర్చిస్తామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ₹160 కోట్లతో 2,42,481 చదరపు అడుగుల్లో సీఆర్‌డీఏ కార్యాలయం నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం రాజధాని పనులు ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement