టీడీపీకి కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. నా మనసుకు దగ్గరున్న జిల్లా శ్రీకాకుళం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళంలో నేడు జరిగిన రా కదలిరా సభలో మాట్లాడుతూ , సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు
అరాచక ప్రభుత్వం ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలనలో అందరూ బాధ్యులే.. తాను కూడా భాదితుడినేనని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ ను మనం తయారుచేసాం.. దానిని ఎవరూ విధ్వంసం చేయలేదని అన్నారు. ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
2029 విజన్తో అమరావతి, పొలవరం ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. అయితే.. 2024లో టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ కంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తుఫాన్ లా వచ్చిందని దుయ్యబట్టారు..
బష్మాసురిడిలా మీ నెత్తిన చేయిపెట్టాడు.. కలియుగ బష్మాసురిడ్ని అంతం చేయటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్.. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క.. బస్సులు కూడా సరిగా లేవు.. రూ.20 కోట్లతో జగన్ బుల్లెట్ ప్రూప్ బస్సులు తెప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనం వృధా చేస్తున్నాడు.. పేదలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తం త్రాగే వ్యక్తి పేదవాడు అవుతాడా.? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్.. నేడు ఎంత..? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు.
జగన్ నాటకాల ముందు సురభినాటకాలు కూడా పనిచేయవని విమర్శించారు. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేసారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వానికి మీరు సిద్దమా..? అని చంద్రబాబు పేర్కొన్నారు
.