Saturday, November 23, 2024

AP – శవరాజకీయాలు చేస్తూ ముసలివారిని చంపేస్తున్న జగన్ – చంద్రబాబు

కొవ్వూరు – సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు మళ్లీ శవరాజకీయాలు చేస్తూ, ముసలివారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు. మొదట కోడి కత్తి డ్రామా, తర్వాత హు కిల్డ్ బాబాయ్ అని సెటైర్లు వేశారు. కొవ్వూరులో ‘ప్రజాగళం’ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. . తన తండ్రిని రిలయన్స్ వారే చంపేశారని జగన్ ఓ సమయంలో అన్నారని.. మళ్లీ వారికే ఎంపీ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేవాడినని చెప్పారు. జగన్ ముక్కుతూ మూలుగుతూ ఏడాదికి రూ. 250 చొప్పున పెంచాడని మండిపడ్డారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓటు వేయవద్దని అతని చెల్లెలు రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నారని గుర్తు చేశారు. గొడ్డలి గుర్తు వైసీపీకి సరైనదని ఎద్దేవా చేశారు.

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థను ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయబోమని, అధికారంలోకి రాగానే తిరిగి వ్యవస్థను కొనసాగిస్తామని పేర్కొన్నారు. పింఛన్లు పంపిణీకి నిధులు లేకపోవడంతో ఆ నెపం టీడీపీపై వేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు పంపిణీకి సరిపడే ప్రభుత్వ ఉద్యోగులను నియమించి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ను రూ.4వేలకు పెంచి అందజేస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని, సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు

ఈ ఎన్నికల్లో జగన్ బెండు తీయడం ఖాయమని దెప్పిపొడిచారు. జగన్‌కు ఇంత అహంకారం పనికిరాదన్నారు. ఆయన అహంకారంతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని చెప్పారు. రాష్ట్రం బాగుకోసం జనంలోకి పవన్ వచ్చారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని గెలిపించాలని కోరారు. తాను ఎండలో ప్రజలు బాగుండాలని వచ్చానని అన్నారు

జగన్ సభలకు 1500 బస్సులను పెట్టి ప్రజలకు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సభ ప్రారంభం కాగానే జనం వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాజకీయం మారుతోందని.. జనంలో ట్రెండ్ మారిందని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement