Friday, October 18, 2024

AP – విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలు – చంద్రబాబు విచారం

అమరావతి:- విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి సీఎం వివరాలు తెలుసుకున్నారు.

నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సిఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా సిఎం తెలుసుకున్నారు.

- Advertisement -

.భారీ వర్షాలపై సిఎం సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సిఎంవో అధికారులకు సూచించారు.

అన్నమయ్య జిల్లాలో ఆలయ ధ్వంసంపై చర్యలకు ఆదేశం

అన్నమయ్య జిల్లా కదిరినాథునికోటలోని అటవీప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయంపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. దుండగుల దాడిలో అలయానికి నష్టం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement