Thursday, November 7, 2024

AP – అమరావతిలో నిరంతర వెలుగులు – గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్న సిఎం

అమరావతి – :కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్‌నిర్మాణంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.. ఇక, అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనికోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ఈ రోజు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ..

రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయపాలెంలో ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా 220/440 కేవీ ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు.

- Advertisement -

తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220 కేవీగా అప్‌గ్రేడ్‌ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు.. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు.. మొత్తంగా అంతరాయం లేకుండా రాజధాని అమరావతికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

అయితే, ఈ రోజు మొత్తంగా ఐదు సబ్‌స్టేషన్ల ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో మరో 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సబ్‌స్టేషన్లు ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారి చెబుతున్నారు.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) భౌతికంగా ప్రారంభించనున్న సీఎం.. మరో నాలుగు సబ్‌స్టేషన్‌లను ప్రారంభించి, మరో 14 వాటికి శంకుస్థాపన చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement