Saturday, December 21, 2024

AP – స్కేటర్ జెస్సీరాజ్ కి చంద్ర‌బాబు అభినంద‌న‌లు…

అమరావతి: మంగళగిరికి చెందిన స్కేటర్ జెస్సీరాజ్ మాత్రపు ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు 2025కు ఎంపికైంది. జెస్సీరాజ్ ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. క్రీడారంగంలో ఆమె సాధించిన అద్భుత ప్రతిభకు దక్కిన గౌరవం ఇదని ప్రశంసించారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకుంటారని తెలిపారు. తొమ్మిదేళ్లకే క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన జెస్సీరాజ్‌కు క్రీడల పట్ల ఉన్న అంకిత భావం ఈ గౌరవాన్ని తెచ్చిందని అభినందించారు. అటు రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు ఆమె ఆదర్శం కానుందని తెలిపారు. 62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్‌ను ఆమె సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement