Thursday, November 21, 2024

AP – రెండు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ నష్టం అంచనా వేయనుంది.

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ, బుడమేరు, వ్యవసాయ పంటలు పరిశీలించనుంది. అలాగే గుంటూరు జిల్లాలోని పెదకాకాని కాలువలు, దేవరాయబొట్లపాలెం పంటపొలాలు పరిశీలించి మంగళగిరి ప్రజలతో మాట్లాడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement