Tuesday, November 26, 2024

AP – గుంత‌క‌ల్లు రైల్వే డివిజ‌న్ కార్యాల‌యంలో సిబిఐ సోదాలు… డిఆర్ఎంతో స‌హా 8 మంది అరెస్ట్

గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలోనూ , ఆయ‌న కార్యాల‌యంపై సిబిఐ అధికారులు దాడి చేశారు… ఆయ‌న తో పాటు డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, రైల్వే ఉద్యోగులు రాజు, ప్రసాద్‌, బాలాజీల ఇంటిపై కూడా సిబిఐ అధికారులు గ‌త మూడు రోజులుగా సోదాలు చేపట్టగా అవి నేటితో ముగిశాయి.. ఈ సోదాల‌లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. దీంతో మొత్తం 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌, డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, సిబ్బంది రాజు, ప్రసాద్‌, బాలాజీ ల‌ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సీబీఐ కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు..

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారిగా అత్యున్నత అధికారిని సిబిఐ అరెస్టు చేసింది. లంచం తీసుకొని అవినీతికి పాల్పడిన డిఆర్ఎంతోపాటు ఉన్నత అధికారులను అరెస్ట్ చేయడం డివిజన్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వే డివిజన్ చరిత్రలో ఒక డిఆర్ఎం లంచం తీసుకుంటూ పట్టుబడింది ఇప్పుడే అని ఉద్యోగులు చెబుతున్నారు.

వివరాల్లో వెళితే..
గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సిబిఐ సోదాలు మూడు రోజులపాటు నిర్వహించారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డి ఎఫ్ ఎం, ప్రదీప్ బాబు, ఓ ఎస్ బాలాజీ లతోపాటు సీనియర్ అసిస్టెంట్లు లతో సంబంధం ఉన్న డిఆర్ఎం వినీత్ సింగ్ లను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు వద్ద కాంట్రాక్టర్లు సత్యనారాయణ, రమేష్ రెడ్డిలు చేస్తున్న సుమారు 120 కోట్ల రూపాయల బ్రిడ్జి వర్కులు జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్టు పర్సంటేజీలను అడగడంతో కాంట్రాక్టర్లకు అధికారులకు 6 నెలల కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు ప్రణాళిక బద్ధంగా మూడు రోజులు కిందట నిర్వహించారు. ఈ దాడుల్లో మొదట ఓఎస్ బాలాజీకి 5 లక్షల రూపాయల నగదు సంచి ఇస్తుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణ ఆధారంగా మిగిలిన డి ఎఫ్ ఎం, డి ఆర్ఎం, ఓ ఎస్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కాంట్రాక్టర్ అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదేవిధంగా సికింద్రాబాద్ లో డిఇఎన్ కోఆర్డినేషన్ అక్కిరెడ్డి నీ అరెస్టు చేశారు. గతంలో ఇక్కడ ఈయన పనిచేసి బదిలీపై సికింద్రాబాద్ వెళ్లారు ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఈయన ప్రమేయం ఉందని నిర్ధారించిన సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement