Friday, November 22, 2024

AP | అమరావతే రాజధాని : ఏపీ సీఎస్

రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ శుభవార్త అందించారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయన్నారు తెలిపారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలో రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే రాజధాని ప్రాంత పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అమరావతి రాజధానిలో 25 ప్రాంతాలను గుర్తించామని, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement