Tuesday, July 2, 2024

AP | ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్ ర‌ద్దు…

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ రేపు( సోమవారం) టెట్‌ నోటిఫికేషన్‌(Notification ) విడుదల చేయనుంది. జులై 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. మిగతా వివరాలకు http://cse.ap.gov.in/ అనే వెబ్‌సైట్‌(Website) ను సంప్రదించాలని సూచించింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ జగన్ ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నిర్ణయం తీసుకోగా, ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం కూడా చేశారు. ఆపై ఏపీ కేబినెట్ డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ఏపీ మంత్రులు వెల్లడించారు. మరోవైపు జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో జగన్ సర్కార్ ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement