Friday, November 22, 2024

FLASH: ఏపీ మంత్రివర్గ సమావేశం.. అజెండాలోని 36 అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్​.. చివరి సమావేశం. మొత్తం 36 అంశాల అజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతోంది. మిల్లెట్ మిషన్ పాలసికి కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. వివిధ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీతోపాటు మొత్తం 574  పోస్టులను డిగ్రీ కళాశాలల్లో భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపనుంది. రాజమహేంద్రవరంలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కొసం ఏపీ టూరిజం కార్పొరేషన్ కు 6 ఎకరాలను ఉచితంగా కేటాయించే  ప్రతిపాదనను ఆమోదం తెలిపనుంది.

రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో హెల్త్ హబ్ పధకం కింద ఆస్పత్రుల నిర్మాణం కోసం భూ కేటాయింపుల ప్రతిపాదనకు ఆమోదించనున్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఇండస్ట్రియల్ పార్కుకు 82 ఎకరాల కేటాయింపు ప్రతిపాదనకు గ్రీస్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆమోదం, కొన్నిచోట్ల మార్పు చేర్పులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ప్రస్తుత జిల్లా పరిషత్ లను కాల పరిమితి ముగిసేంత వరకు కొనసాగించేందుకు చట్ట సవరణకు నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ మంత్రివర్గవం ఆమోదం తెలపనుంది.

కాగా, కేబినెట్ సమావేశం అనంతరం 25 మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా సమర్పణకు ఖాళీ లెటర్ హెడ్‌లతో మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement