Tuesday, November 5, 2024

AP | రేపు కేబినేట్ స‌మావేశం !

ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాలు చ‌ర్చకు రానున్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 రద్దు బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

ఇక‌ నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంశంపై చర్చ జరగనుంది. దీంతో పాటు జీవో 77ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది.

కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్ల కు పెంపుపైనా కేబినెట్ చర్చించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement