ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుమారు మూడు గంటలకుపైగా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.
ఏపీ లాజిస్టిక్స్ పార్క్, నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం,
ఆక్వా రైతుల మార్కెటింగ్ కోసం ఫిష్ మార్కెటింగ్ పాలసీ, నాడు-నేడు రెండో దశ పనులు ఆగస్ట్-16న ప్రారంభం కానుండడంతో వాటికి కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరవనున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై చర్చిస్తారు.గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కేబినెట్ చర్చించనున్నది.