ఏపీ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్‌లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం ప్రకటిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్‌లో చర్చించనున్నారు.
- Advertisement -