మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత ఏపీ కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. కొత్త మంత్రివర్గం తొలి సమావేశంలో కీలక నిర్ణయాలను ఏజెండాగా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లు మరోసారి కేబినెట్ లో చర్చించే అవకాశముంది. అలాగే మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపు ఉదయం 11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నారు. మంత్రివర్గపునర్ వ్యవస్తీకరణ తర్వాత తొలిసారిగా కేబినేట్ భేటీ కానుంది.