ఏపీ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సియం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా పలు కీలక ఎజెండాలపై కేబినెట్ చర్చించనుంది. అన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మకాలకు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫి చట్టానికి సవరణకు అర్డినెన్స్ కు కేబినెట్ అమోదం తెలపనుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. శాసనసభ సమావేశాల నిర్వహణ పై చర్చ జరగనుంది.
టీటీడీలో ప్రత్యేక అహ్వానితుల నియామకంపై చర్చించనున్నారు. ప్రత్యేక అహ్వానితుల కోసం చట్టసవరణ, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణపై కేబినెట్ లో చర్చ జరగనుంది. దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటుతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ కానున్నారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమిత్ షా ఫోన్