Monday, December 23, 2024

AP Cabinet: ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్‌లో10 అంశాలపై చర్చ జరుగనుంది.

ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించడంతో పాటు, ఆ నిర్ణయాలను కేబినెట్‌లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్ ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement