Thursday, October 10, 2024

AP: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం..

మరికాసేపట్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.

అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా ఈ సమావేశంలో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement