ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. అలాగే ఎన్నికల హామీల అమలు తేదిలను ఈ కేబినెట్ లో ఖరారు చేసే అవకాశాలున్నాయి.. ఇక ఇప్పటికే కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు.
ఇక కొత్తగా ఎన్నికైన శాసన సభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.