ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 17న జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది.
కేబినెట్ భేటీలో పాలనాపరంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే వివిధ సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీఎం చంద్రబాబు దావోస్ టూర్ పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తరువాత మరుసటి రోజు సీఎం చంద్రబాబు బృందం దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లనుంది.