ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం కానున్నారు.
ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.