అమరావతి – ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, వాటి ప్రస్తుత భవిష్యత్తు కార్యాచరణపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై కేబినెట్ చర్చించనుంది.