సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్.. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదించింది. విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు, జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. అలాగే శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు…