ఏపీ కేబినెట్ విస్తరణకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రి పదవులు కోల్పోనున్న అమాత్యులను ఈ నెల 27 న రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. అయితే, పెద్దిరెడ్డి , కొడాలి నాని, పేర్ని నానిలు కొనసాగించే అవకాశం ఉంది.
ఇక, బుగ్గన, బాలినేనిలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక,కొత్త మంత్రులు ఉగాది రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, హోమ్ మంత్రి పదవి మళ్ళీ మహిళకే దక్కే అవకాశం ఉంది. కొత్త కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండే ఛాన్స్ ఉంది. 50 శాతం మంత్రి పదవులు బీసీలకు, 33 శాతం మంత్రి పదవులు మహిళలకు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక, సీనియర్ మంత్రి బొత్సకు పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. 25 జిల్లాలకు మంత్రి పదవులు ఇచ్చేలా సీఎం జగన్ ప్లాన్ చేశారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని పార్టీ కేంద్రాలయ కార్యాలయ బాధ్యతలు విజయ సాయి రెడ్డికి అప్పగించారు.