Saturday, June 29, 2024

AP : మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరగ్గా.. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 10వ తేదీ లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేబినెట్ ముందుకు డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ రాగా.. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పెన్షన్ల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించాక.. తొలిరోజు చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా చర్చ జరుపుతున్నారు. అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చే దిశగా కూడా కేబినెట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement