Tuesday, December 3, 2024

AP: ల్యాండ్ గ్రాబింగ్, ప్రొహిబిషన్ బిల్లులకు కేబినెట్ ఆమోదం

పిఠాపురం అభివృద్ధి మండ‌లి ఏర్పాటు..
సీఆర్డీఏ పరిధి పెంపు
పంచాయితీ రాజ్ బిల్లుల బ‌కాయిలు చెల్లింపు
జ్యుడీషియల్ ఆఫీసర్‌ల వ‌యో ప‌రిమితి పెంపు
ఎపి కేబినెట్ ఆమోద ముద్ర‌
చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న నేడు స‌మావేశం

అమ‌రావ‌తి – పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కొనసాగుతున్న, పూర్తి అయిన పనులకు సంబంధించి 2014-15 నుంచి 2018-19 సంవత్సరాలకు బిల్లులు చెల్లింపులకు ఎపి కేబినెట్‌లో ఆమోదముద్ర వేసింది. ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ ముసాయిదా బిల్ 2024 ను ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్ 1982 స్థానంలో తీసుకురావడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు జరిగిన మంత్రి మండ‌లి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 10 అంశాలపై చ‌ర్చించారు.

ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 ను సవరణ చేసి రిటైర్మెంట్ వయసును జ్యుడీషియల్ ఆఫీసర్‌లకు 60 నుండి 61 కి మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది 1.11.24 నుంచి అమలులోకి రానుంది. అలాగే ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లుకు 2024 కు కేబినెట్‌లో ఆమోదం లభించింది. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారం లిక్కర్ ఆర్డినెన్స్ 2024లకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్‌గా నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడం ద్వారా సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ గోల్స్ పేదరిక నిర్మూలనకు తీసుకునే చర్యలకు క్యాబినెట్‌లో ఆమోదం లభించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడ)ని పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.

సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, ఆరు మండలాలు, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి 8352.69 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. అలాగే పిఠాపురం అభివృద్ధి మండ‌లి ఏర్పాటున‌కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

- Advertisement -

2024-25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను నేరుగా కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి పంపేలా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం వల్ల కోర్సు ముగిసిన వెంటనే విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు జారీ అవుతాయని మంత్రిమండలి భావిస్తోంది. 2024 జూన్ 24 నుంచి 2024 అక్టోబర్ 23 వరకు కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చింది.

ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ.
డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన.
డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం.
ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్..
డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు.
300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు.
25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ.
రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు,
50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం.

ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.Oకి కేబినెట్ ఆమోదం

డేటా సెంటర్లు అనేది అతి పెద్ద మార్కెట్. ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు పెడుతున్నారు. హైదరాబాద్‌ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదు. ఈ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని, ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.Oకి కేబినెట్ ఆమోదం తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement