Thursday, December 19, 2024

AP – అమరావతి పనులకు చంద్రబాబు మంత్రి వర్గం గ్రీన్ సిగ్న‌ల్‌


ఏపీ కేబినెట్‌లో పలు కీల‌క నిర్ణ‌యాలు ఎన్టీరంగా వర్సిటీకి 50 ఎకరాల భూమి
జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం
పోలవరం ప్రాజెక్టు కోసం కొత్త టెండర్లు
ధాన్యం కొనుగోలుకు మరో ₹1000 కోట్ల సాయం
మంత్రి మండలి భేటీలో 21 అంశాలపై చర్చ
కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన కేబినెట్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి : అమరావతి పనులకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జ‌రిగిన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 21 అంశాల‌తో కూడాన ఏజెండాపై ఈ భేటీలో చ‌ర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు ₹8821 కోట్లు పరిపాలన అనుమతులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో 25 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు ₹24,316 కోట్లు మంజూరుకు ప్రతిపాదనకు ఆమోదించారు. 176 పనుల మంజూరు కేడర్ స్ట్రెంత్‌ను నూతనంగా ఏర్పాడిన 12 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు బదిలీకి కేబినెట్‌లో ఆమోదించారు. జల్ జీవన్ మిషన్​లో కొన్ని పనులను రద్దుచేసి తిరిగి మోడిఫై చేసిన అయిదు పనులకు రీ టెండర్ పిలిచేందుకు, అగ్రిమెంటు గడువు పొడిగించేందుకు కేబినెట్‌లో ఆమోదించారు.

ఆమోదిత కీలక బిల్లులివే..

ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు కేబినెట్​ అనుమతిచ్చింది. అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి ₹11 వేల కోట్లు కేఎఫ్ డబ్ల్యు నుంచి ₹16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఏపీ రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

స్టాంప్ డ్యూటీ మినహాయింపు..

- Advertisement -

ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు కర్నూలు రూరల్ మండలంలో బి టాండ్రపాడు గ్రామంలో కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదించారు. వరద బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులకు ఆమోదం తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు అదనంగా మరో ₹1000 కోట్లు రుణం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ నుంచి తీసుకొని పౌరసరఫరాల శాఖకు బదిలీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పోలవరం కోసం కొత్త టెండర్లు..

పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒప్పందం ఇప్పటికే గడువు ముగిసినందున టెండర్లు పిలవడానికి కేబినెట్‌ అనుమతి ఇచ్చింది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ, ఎన్ఆర్ఈడీసీఏపీ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, నోట్ బుక్కులు, ప్రాక్టికల్ రికార్డుల కోసం 32,45,88,679 రూపాయల కోసం కేబినెట్‌లో పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధులు కేటాయింపునకు పరిపాలన అనుమతి మంజూరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement