Wednesday, November 20, 2024

Breaking: బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం..

ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23కు  కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఉదయం 10.15 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టునున్నారు.

 బడ్జెట్‌లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏపీ ప్రజలు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక, శాసనమండలిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సాధారణ బడ్జెట్‌ను, వ్యవయసాయ బడ్జెట్‌ను సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు. 

వరుసగా రెండో ఏడాది జెండర్‌ బేస్ట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్‌ ఉంటుందనే సంకేతాలు ఉన్నాయి. బడ్జెట్‌లో ముఖ్యంగా నవరత్నాలకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం. అభివృద్ధి నిధి కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లను బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement