అమరావతి – ఎపి బడ్జెట్ లో వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి రంగాలకు భారీగా నిధులు కేటాయించారు..నేటి ఉదయం అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. సభలో బడ్జెట్ ప్రసంగానికి అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్న 14 మంది తెలుగు దేశం సభ్యులను సభను స్పీకర్ సస్పెండ్ చేశారు.. ఇక ఎపి బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు..రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు, రెవెన్యూ లోటు – 22,316 కోట్లుగా , ద్రవ్య లోటు – 54,587 కోట్లుగా బుగ్గన పేర్కొన్నారు.. బడ్జెట్ సమావేశానికి ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. ఇక సాధారణ బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ,మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు..
బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
రూ. 2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన.
రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు,
మూల ధన వ్యయం – 31,061 కోట్లు
రెవెన్యూ లోటు – 22,316 కోట్లు
ద్రవ్య లోటు – 54,587 కోట్లు
జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు – 3.77 శాతం
ద్రవ్య లోటు – 1.54 శాతం.
కేటాయింపుల వివరాలు..
వైఎస్ఆర్ వాహన మిత్ర రూ. 275 కోట్లు.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంకు రూ. 125 కోట్లు.
వైఎస్ఆర్ – పీఎం బీమా యోజన పథకంకు రూ. 1600 కోట్లు.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు.
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 550 కోట్లు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంకు రూ. 21,434.72 కోట్లు.
వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 4,020 కోట్లు
వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా పథకానికి రూ.6,700కోట్లు
SC కార్పొరేషన్‌కు 8384.93 కోట్లు.
ST కార్పొరేషన్‌కు 2428 కోట్లు.
బీసీ కార్పొరేషన్‌లకు 22,715 కోట్లు.
ఈబీసీ కార్పొరేషన్ కు 6165 కోట్లు.
కాపు కార్పొరేషన్ 4887 కోట్లు.
క్రిస్టియన్ కార్పొరేషన్ కు 115.03 కోట్లు.
బ్రాహ్మణ కార్పోరేషన్ 346.78 కోట్లు.
మైనారిటీ కార్పొరేషన్ 1868.25 కోట్లు.
వ్యవసాయంకు రూ. 11,589.48 కోట్లు.
వైద్య ఆరోగ్య శాఖ కు రూ. 15,882.34 కోట్లు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873.83 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 6,546.21 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ. 29,690.71 కోట్లు.
ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీకి రూ. 9,118.71 కోట్లు.
బ్రాహ్మణ కార్పొరేషన్ – రూ. 346.78 కోట్లు
మైనార్టీ కార్పొరేషన్ రూ. 1,868.25 కోట్లు
పశు సంవర్ధక శాఖ – రూ. 1787 కోట్లు.
పర్యావరణ పరిరక్షణకు – రూ. 685 కోట్లు.
ఉన్నత విద్యకు – రూ. 2065 కోట్లు.
ఇంధన శాఖకు – రూ. 6546 కోట్లు.
మాధ్యమిక విద్యకు రూ. 29,691 కోట్లు.
అగ్రవర్ణ పేదల సంక్షేమంకోసం రూ. 11,085 కోట్లు.
సివిల్ సప్లయ్ – రూ. 3725 కోట్లు.
ఆర్థిక శాఖకు – 72,424 కోట్లు.
గ్రామ, వార్డు సచివాలయాలు – 3,858 కోట్లు.
హోంశాఖకు – 8,206 కోట్లు.
హౌసింగ్‌కు – 6,292 కోట్లు.
ఇరిగేషన్‌కు రూ. 11,908 కోట్లు.జగనన్న చేదోడు రూ. 350కోట్లు
జగనన్న విద్యాదీవెన – రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతిదీవెన – రూ.2,200 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు – రూ.500 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,212 కోట్లు.
లా నేస్తంకు రూ.17 కోట్లు.
ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు.
నాడు- నేడు పథకానికి రూ.3,500కోట్లు.
వైఎస్సార్ చేయూత పథకానికి రూ.5వేల కోట్లు.
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి రూ. 50 కోట్లు.
ఈబీసీ నేస్తంకు రూ. 610 కోట్లు.
అమ్మఒడి పథకానికి రూ. 6,500 కోట్లు.
మొత్తం డీబీటీ స్కీంలకు రూ. 54,228.36 కోట్లు.
ధర స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లు.