Wednesday, September 18, 2024

AP – అంబేద్కర్ పేరుతో రాజకీయమా …

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఎన్టీఆర్ బ్యూరో : తన హ‌యాంలో జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కడమే కాకుండా దళితుల దమనకాండ కు ఆజ్యం పోసింది జగనే అన్నారు.

కులాల మధ్య చిచ్చుపెట్టి వారిని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి రాక్షసానందం అందడం ఒక్క జగన్ కే సాధ్యమన్నారు. అసలు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత జగన్ మోహన్ రెడ్డికి లేదన్న ఆయన అతి త్వరలోనే అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

అంబేద్కర్ కంటే జగన్ గొప్పోడా?

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపాడన్నారు. పదవి పోయేసరికి మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదన్నారు.

- Advertisement -

అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉందని, అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు. జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారన్న ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్ అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని చంద్రబాబు నిర్ణయిస్తే దాన్ని మార్చి జగన్ మోహన్ రెడ్డి 404 కోట్లతో ఇక్కడ ఏర్పాటు చేశార‌ని బుద్దా వెంక‌న్న మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement