Sunday, November 10, 2024

AP – విజయవాడను ముంచింది బుడమేరే

విజయవాడ – వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏర్లు, నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, కొన్నింటిని దారి మళ్లించారు.కొండపల్లి, రాయనపాడులో రైలుపట్టాలపై వరదతో, ట్రాక్‌పైనే రైళ్లు నిలిచి పోయాయి. బస్సుల్లో ప్రయాణికులను అధికారులు తరలించారు.

.భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బాధితులను పరామర్శించేందుకు విజయవాడ సింగ్‌ నగర్‌లో ఆయన పర్యటించారు.

బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్‌ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.విజయవాడలో ఇంత పెద్ద విపత్తును తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.వరద పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement